పుష్ప విషయంలో మరో క్రేజీ రూమర్.. పాన్ ఇండియా రేంజ్ అంటే మాటలా..

Crazy Rumour On Allu Arjun Pushpa Movie. తాజాగా ఈ సినిమా విషయంలో క్రేజీ రూమర్ వైరల్ అవుతూ ఉంది. ఈ సినిమా రెండు భాగాల్లో వస్తుందని అంటున్నారు.

By Medi Samrat  Published on  12 May 2021 4:29 AM GMT
Pushpa

అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప' సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే..! ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ భారీ ఎత్తున వ్యూస్ ను సొంతం చేసుకుంది. తగ్గేదే లే.. అంటూ టీజర్ లో పుష్ప చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందాన కూడా నటిస్తూ ఉంది. విలన్ గా మలయాళీ నటుడు ఫహాద్ ఫాసిల్ కూడా చేస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి.

తాజాగా ఈ సినిమా విషయంలో క్రేజీ రూమర్ వైరల్ అవుతూ ఉంది. ఇంతకూ అదేమిటంటే.. ఈ సినిమా రెండు భాగాల్లో రాబోతూ ఉండడమే..! ప్రస్తుతానికైతే ఈ సినిమా రెండు భాగాల్లో వస్తుందని అంటున్నారు. పాన్ ఇండియా రేంజిలో చిత్రీకరిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అయితే భారీ కలెక్షన్లు రాబట్టొచ్చని చిత్ర యూనిట్ భావిస్తూ ఉందట. ఇక దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా రేంజిలో రెండు భాగాలుగా విడుదలై భారీ కలెక్షన్లు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే..! బాహుబలి రెండు భాగాల్లో విడుదలై భారీ కలెక్షన్లు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.. కేజీఎఫ్ కూడా రెండు భాగాల్లో విడుదలవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పుష్ప సినిమా కూడా రెండు భాగాల్లో విడుదల అవుతూ ఉందనే వార్త అల్లు అర్జున్ అభిమానులలో ఆనందాన్ని నింపుతూ ఉంది. ఇక చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావడమే తరువాయి అని అంటూ ఉన్నారు.

అల్లు అర్జున్ ఇటీవలే కరోనా బారిన పడ్డారు. అల్లు అర్జున్ తనకు కరోనా వచ్చిందని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అల్లు అర్జున్ ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న అభిమానుల కోసం ఓ పోస్టు చేశారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, క్రమంగా కోలుకుంటున్నాని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. తానింకా క్వారంటైన్ లోనే ఉన్నానని అల్లు అర్జున్ వెల్లడించారు. తాను కరోనా బారినపడ్డానని తెలియగానే విశేష ప్రేమాభిమానాలు కురిపిస్తూ, తన కోసం ప్రార్థిస్తున్న అందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు.


Next Story