అనుపమ పరమేశ్వరన్‌కి క్రేజీ ఆఫర్..  'డీజే టిల్లు 2' నుంచి బిగ్ అప్ డేట్! 

Crazy offer for heroine Anupama Parameswaran.. Big up date from 'DJ Tillu 2'. అనుపమ పరమేశ్వరన్ కి ఇప్పుడు తెలుగులో భారీ ఫాలోయింగ్ వచ్చింది. తన ఆక్టింగ్ తో అందర్నీ ఆకట్టుకుంటుంది.

By Sumanth Varma k  Published on  2 Oct 2022 7:17 AM GMT
అనుపమ పరమేశ్వరన్‌కి క్రేజీ ఆఫర్..  డీజే టిల్లు 2 నుంచి బిగ్ అప్ డేట్! 

అనుపమ పరమేశ్వరన్ కి ఇప్పుడు తెలుగులో భారీ ఫాలోయింగ్ వచ్చింది. తన ఆక్టింగ్ తో అందర్నీ ఆకట్టుకుంటుంది. పైగా నటనలో అనుపమ పరమేశ్వరన్ కి ప్రత్యేకమైన శైలి ఉంది. అందుకే, ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

ఈ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ కి మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న 'డీజే టిల్లు'కు సీక్వెల్ గా 'డీజే టిల్లు 2' రాబోతోంది. ఈమూవీలో హీరోయిన్ గా తొలుత శ్రీలీలను అనుకున్నారు. అయితే, ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. అందుకే, ఆమె ప్లేస్‌లో అనుపమ పరమేశ్వరన్ ను తీసుకుంది టీమ్.

ఇప్పటికే 'కార్తికేయ 2' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అనుపమ పరమేశ్వరన్. ఇప్పుడు 'డీజే టిల్లు 2'తో మరో బ్లాక్ బాస్టర్ అందుకుంటుందా ?, లేదా ? అనేది చూడాలి.

టాలీవుడ్‌ లో అనుపమ పరమేశ్వరన్ కి వరుస చాన్స్ లు వస్తున్నాయి. తాజాగా అనుపమ పరమేశ్వరన్ డీజే టిల్లు 2 తో తన స్టామినాను ప్రూవ్ చేసుకుంటే ఇక ఈ టాలెంటెడ్ హీరోయిన్ కి తెలుగులో తిరుగు ఉండదు. స్టార్ డైరెక్టర్లు సైతం తమ తరువాతి ప్రాజెక్టుల్లో మెయిన్ హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ కు చాన్స్‌లిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

Next Story
Share it