విజయ్ 'జన నాయగన్'కు సెన్సార్ కష్టాలు..తీర్పు రిజర్వ్ చేసిన మద్రాస్ హైకోర్టు
తమిళ నటుడు దళపతి విజయ్ పూర్తిగా రాజకీయ రంగం లోకి దిగడానికి ముందు ఆయన చివరి చిత్రంగా నిలిచిన ' జన నాయగన్' సినిమాకి కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు
By - Knakam Karthik |
విజయ్ 'జన నాయగన్'కు సెన్సార్ కష్టాలు..తీర్పు రిజర్వ్ చేసిన మద్రాస్ హైకోర్టు
తమిళ నటుడు దళపతి విజయ్ పూర్తిగా రాజకీయ రంగం లోకి దిగడానికి ముందు ఆయన చివరి చిత్రంగా నిలిచిన ' జన నాయగన్' సినిమాకి కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు . సెన్సార్ బోర్డు నుండి సర్టిఫికెట్ పొందడానికి తమిళ చిత్ర నిర్మాతలు చట్టపరమైన పరిష్కారం కోరిన ఒక రోజు తర్వాత, మద్రాస్ హైకోర్టు బుధవారం తన తీర్పును శుక్రవారం (జనవరి 9) విడుదలకు రిజర్వ్ చేసింది.
బుధవారం జరిగిన విచారణ సందర్భంగా, జన నాయగన్ సినిమాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కొత్త కమిటీ సమీక్షిస్తుందని కోర్టు తెలిపింది. ఈ ఆలస్యం జన నాయగన్ విడుదలకు పెద్ద అడ్డంకిగా మారింది . హిందీ, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో డబ్ చేయబడిన వెర్షన్‌లను క్లియర్ చేయడానికి ముందు సినిమా తమిళ వెర్షన్ యొక్క సర్టిఫికేషన్ అవసరం. ఇంతలో, సెన్సార్‌షిప్ కేసులో తాజా పరిణామాల నేపథ్యంలో కొన్ని నగరాల్లో బుక్‌మైషో నుండి సినిమా యొక్క 'బుక్ టికెట్స్' ఎంపికను తొలగించారు.
నిర్మాతల తరఫున వాదించిన లాయర్ పరాశరన్ మాత్రం ఇవాళే తీర్పు ఇవ్వాలని కోరారు. ఎల్లుండి సినిమా రిలీజ్ ఉండటంతో ఇవాళే ఇవ్వాలని కోరారు. కానీ న్యాయమూర్తి మాత్రం తీర్పును వాయిదా వేశారు. కోర్టులో 9వ తేదీన ఈ విచారణకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అంటే సినిమా 9వ తేదీన రిలీజ్ కాకపోవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు విజయ్ చివరి సినిమా కావడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో పొంగల్ ముందే వచ్చేసిందా అన్న రీతిలో అభిమానుల కోలాహలం ఉంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం టికెట్ ధర 190 రూపాయలు. అయితే బ్లాక్‌లో ఈ సినిమా టికెట్ 5వేల రూపాయలు పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన జన నాయగన్‌లో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి , నరైన్ కూడా నటించారు