అల్లు అర్జున్ కేసుకు కోర్టు బ్రేక్..చార్జ్‌షీట్‌ను మళ్లీ తిప్పి పంపిన కోర్టు

హైదరాబాద్‌లో సంచలనం రేపిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు మరోసారి రిటర్న్ చేసింది

By -  Knakam Karthik
Published on : 20 Feb 2026 4:31 PM IST

Hyderabad News, Allu Arjun, Sandhya Theater, Pushpa2, Nampally Court, Tollywood News

అల్లు అర్జున్ కేసుకు కోర్టు బ్రేక్..చార్జ్‌షీట్‌ను మళ్లీ తిప్పి పంపిన కోర్టు

హైదరాబాద్‌లో సంచలనం రేపిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు మరోసారి రిటర్న్ చేసింది. ఇదే కేసులో ఇప్పటికే రెండుసార్లు చార్జ్‌షీట్‌ను తిరస్కరించిన కోర్టు, తాజాగా సమర్పించిన చార్జ్‌షీట్‌లో కూడా పలు లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ సహా మొత్తం 23 మందిపై పోలీసులు అభియోగాలు మోపుతూ చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.

అయితే దాఖలు చేసిన పత్రాల్లో సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేకపోవడం, సాంకేతికపరమైన లోపాలు ఉండటం కోర్టు దృష్టికి వచ్చింది. ప్రత్యేకంగా కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ మెటీరియల్‌, హార్డ్‌డిస్క్‌లు, సీడీలు, పెన్‌డ్రైవ్‌లు వంటి డిజిటల్ సాక్ష్యాలను చార్జ్‌షీట్‌కు జత చేయకపోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో చార్జ్‌షీట్‌ను తిరిగి పంపిస్తూ, లోపాలను సరిచేసి మళ్లీ సమర్పించాలని ఆదేశించింది. కోర్టు సూచనల మేరకు లోపాలను సవరించిన పోలీసులు తాజాగా మరోసారి చార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ ఎలా ముందుకు సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story