హీరో నాని నిర్మాతగా తెరకెక్కించి భారీ విజయం సొంతం చేసుకున్న కోర్టు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఈ క్రమంలో ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. నాని సమర్పించిన ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహించగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.
అయితే ఇప్పటికే తమ ఓటీటీ కమింగ్ సూన్ బ్లాగ్‌లో కోర్టు మూవీని నెట్‌ఫ్లిక్స్ చేర్చింది. అందులోనే స్ట్రీమింగ్ వివరాలను ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది.