చిరంజీవికి రెండోసారి కరోనా పాజిటివ్‌..!

Corona positive for megastar Chiranjeevi for the second time. ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. వరుసపెట్టి మరీ.. సినీ ఇండస్ట్రీ నటులకు కరోనా

By అంజి  Published on  26 Jan 2022 4:53 AM GMT
చిరంజీవికి రెండోసారి కరోనా పాజిటివ్‌..!

ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. వరుసపెట్టి మరీ.. సినీ ఇండస్ట్రీ నటులకు కరోనా సోకుతోంది. తాజాగా టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవికి రెండోసారి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. తనకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నానని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. త్వరలోనే మీ అందరిని కలుస్తానని, ప్రతి ఒక్కరూ కరోనా నియమ నిబంధనలను పాటించాలని సూచించారు.

అంతకుముందు 2020, నవంబర్‌ 9న మొదటిసారి కరోనా బారినపడ్డారు చిరంజీవి. ఆచార్య సినిమా షూటింగ్‌ కోసం కరోనా పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని అప్పట్లో చిరంజీవి తెలిపారు. చిరంజీవి కొత్త మూవీ 'ఆచార్య' ఉగాది పండుగకు కానుకగా ఏప్రిల్‌ 1వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో చిరు తనయుడు రామ్‌చరణ్ కూడా నటించారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ సినిమాను తెరకెక్కించింది. కాజల్‌, పూజా హెగ్దేలు హీరోయినట్లు నటించారు. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో భారీ బడ్జెట్‌ సినిమాలు ఆర్‌ఆర్‌ఆర్‌, రాధేశ్యామ్‌ వాయిదా పడ్డాయి.

Next Story
Share it