శ్రీకాంత్ అయ్యంగార్ "మా" సభ్యత్వం రద్దు చేయండి
ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆదివారం మా అధ్యకుడు మంచు విష్ణును కలిశారు.
By - Medi Samrat |
ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆదివారం మా అధ్యకుడు మంచు విష్ణును కలిశారు. మహాత్మా గాంధీపై సోషల్ మీడియాలో అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ " మా" సభ్యత్వం రద్దు చేయాలని విష్ణును ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ కోరారు. ఈ విషయమై సినీ పరిశ్రమలోని పెద్దలు కూడా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఫిర్యాదుపై మా అధ్యక్షుడు సానుకూలంగా స్పందించారు. మా కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటామని మా ట్రెజరర్ శివ బాలాజీ తెలిపారు. రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని మా చెప్పిందని ఎమ్మెల్సీ వెల్లడించారు.
ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆదివారం మా అధ్యకుడు మంచు విష్ణును కలిశారు. మహాత్మా గాంధీపై సోషల్ మీడియాలో అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఆయన " మా" సభ్యత్వం రద్దు చేయాలని కోరారు. pic.twitter.com/JftJOWjmTB
— Newsmeter Telugu (@NewsmeterTelugu) October 12, 2025