హీరో విజయ్ ఆంటోని కుమార్తె ఆత్మహత్య

గాయకుడు, నటుడు, దర్శకుడు, నిర్మాత విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆంటోని కుమార్తె మీరా సెప్టెంబర్ 19 తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది.

By అంజి  Published on  19 Sep 2023 2:24 AM GMT
Vijay Antony, suicide, Crime news

హీరో విజయ్ ఆంటోని కుమార్తె ఆత్మహత్య

గాయకుడు, నటుడు, దర్శకుడు, నిర్మాత విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆంటోని కుమార్తె మీరా సెప్టెంబర్ 19 తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయస్సు 16 సంవత్సరాలు. నివేదికల ప్రకారం.. మీరా చెన్నైలోని తేనాంపేటలో గల తన నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఉరివేసుకుని కనిపించడంతో ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. ఆమె గత కొన్ని రోజులుగా ఒత్తిడికి లోనవుతోందని, దాని కోసం చికిత్స పొందుతోందని తెలిసింది. ఆమె అన్నాసాలైలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుకుంటోంది. అయితే మీరా ఆత్మహత్య అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఆమె మృతిపై అసలు కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె గత కొన్ని నెలలుగా డిప్రెషన్‌తో పోరాడుతోంది. ఆమె చర్చ్ పార్క్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతోంది. తమిళ మీడియా ఛానల్స్ ప్రకారం, ఆమె తండ్రి విజయ్ ఆంటోనీ తెల్లవారుజామున 3 గంటలకు కుమార్తె గదిలోకి వెళ్లినప్పుడు, ఆమె ఫ్యాన్ హుక్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చూసి షాక్ అయ్యాడు. ఇంట్లో పనిచేసే కూలీల సాయంతో ఆమెను కిందకు దించి కారులో కావేరీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మీరా యొక్క విషాదకరమైన ఆత్మహత్య.. నిరాశ, ఒత్తిడిలే కారణమని చెప్పవచ్చు. విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఆయనకు ఫోన్ చేసి సంతాపం చెబుతున్నారు.

Next Story