అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత డైరెక్టర్ ఆర్జీవీ స్పంధించారు. వరుసగా ట్వీట్స్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రశ్నలు సంధించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతంలో అరెస్టైన వీడియోను పోస్ట్ చేశారు. అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయంలో కామన్ పాయింట్ ఏంటి? అని ఆర్జీవీ ప్రశ్నించారు. వాళ్లిద్దరినీ బెడ్రూమ్లోకి వెళ్లి మరి అరెస్ట్ చేశారని ఆయనే సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శుక్రవారం ఉదయం హైదారాబాద్ లోని జూబ్లీహిల్స్లో అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రిమాండ్ విధించింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయమే బన్నీ జైలు నుంచి విడుదలయ్యారు.