కృష్ణ పార్థివ‌దేహానికి నివాళుర్పించిన సీఎం జ‌గ‌న్‌

CM YS Jagan Pays Last Respects to Superstar Krishna.ఆంధ్రప్రదేశ్ సీఎం జ‌గ‌న్‌ పద్మాలయ స్టూడియోకు చేరుకున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Nov 2022 6:33 AM GMT
కృష్ణ పార్థివ‌దేహానికి నివాళుర్పించిన సీఎం జ‌గ‌న్‌

ఆంధ్రప్రదేశ్ సీఎం జ‌గ‌న్‌ పద్మాలయ స్టూడియోకు చేరుకున్నారు. న‌టశేఖ‌రుడు, సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి జగన్ నివాళులర్పించారు. అనంత‌రం ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు.

అంత‌క ముందు కృష్ణ భౌతిక కాయానికి సినీ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ కుటుంబం నివాళుర్పించింది. భార్య‌, కుమార్తెతో క‌లిసి ప‌ద్మాల‌య స్టూడియోకి వ‌చ్చిన బాల‌కృష్ణ పూల‌మాల వేసి అంజ‌లి ఘ‌టించారు.


అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ మ‌న మ‌ధ్య లేర‌న్న‌ది న‌మ్మ‌లేని నిజ‌మ‌న్నారు. కృష్ణ త‌న సిరీ కెరీర్‌లో ఎన్నో ప్ర‌యోగాలు, సాహ‌సాలు చేశార‌న్నారు. ఏ కొత్త టెక్నాల‌జీ వ‌చ్చినా తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచ‌యం చేశారు. ప‌ద్మాల‌య స్టూడియోస్ స్థాపించి గొప్ప సినిమాలు తీశారు. నిర్మాత‌ల పాలిట క‌ల్ప‌వృక్షం. కృష్ణ‌గారితో క‌లిసి సుల్తాన్ చిత్రంలో న‌టించా. షూటింగ్ కోసం అండ‌మాన్ వెలితే.. నాన్న‌గారి గురించి ఎన్నో విష‌యాలు చెప్పేశారు. ఎన్టీఆర్‌, కృష్ణ‌లు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు స్పూర్తి ప్ర‌ధాత‌లు అని బాల‌కృష్ణ అన్నారు.


దర్శకుడు త్రివిక్రమ్, నటుడు కృష్ణుడు, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టు శివ బాలాజీ, సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీనివాస‌రావు త‌దిత‌రులు ప‌ద్మాల‌య స్టూడియోకు చేరుకుని శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.


Next Story