ఓ శ‌కం ముగిసింది.. ప్ర‌ముఖుల ట్వీట్లు

Cinema Celebrities Condolences to Dileep Kumar.లెజండరీ యాక్టర్‌ దిలీప్ కుమార్ ఇవాళ ఉదయం కన్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 July 2021 10:05 AM IST
ఓ శ‌కం ముగిసింది.. ప్ర‌ముఖుల ట్వీట్లు

లెజండరీ యాక్టర్‌ దిలీప్ కుమార్ ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని హిందూజా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తన 98 ఏండ్ల వయస్సలో తుదిశ్వాస విడిచారు. దిలీప్ కుమార్ మ‌ర‌ణ వార్త సినీ ప‌రిశ్ర‌మ‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌పై సినీ సెల‌బ్స్ ఓ శకం ముగిసింది. బాలీవుడ్ లెజెండ్స్‌లో మ‌రో యాక్ట‌ర్ క‌న్నుమూయ‌డం బాధ‌కు గురి చేస్తుంద‌ని ప‌లువురు ట్వీట్స్ చేస్తున్నారు.

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ దిలీప్ కుమార్ మ‌ర‌ణ వార్త‌పై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తూ.. దిలీప్ కుమార్ ఒక సినిమా లెజెండ్‌గా ఎప్ప‌టికీ అందరి మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ఆయ‌న అస‌మాన న‌ట‌న ఎన్నో త‌రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తుంది. దిలీప్ కుమార్ మృతి సినీ రంగానికి తీర‌ని లోటు. ఆయ‌న కుటుంబానికి, స్నేహితుల‌కు, అభిమానుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను ట్వీట్ చేశారు.

భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల్లో ఒక‌రైన దిలీప్‌కుమార్ మృతితో సినీ ప‌రిశ్ర‌మ‌లో ఒక శ‌కం ముగిసింది. ఆయ‌న ఒక సినీ సంస్థ‌, సినీ సంప‌ద‌, కొన్నేళ్ల‌పాటు త‌న న‌ట‌న‌తో ఎంతోమందిని ఆకట్టుకున్న లెజెండ్ మృతి బాధాక‌రం. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నాను- చిరంజీవి

ఇండియ‌న్ సినిమాకు దిలీప్ కుమార్ అందించిన సేవ‌లు వెలక‌ట్టలేనివి. మిమ్మ‌ల్ని త‌ప్ప‌క మిస్ అవుతాం. మీ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నాను - ఎన్టీఆర్‌

ఈ ప్ర‌పంచానికి చాలా మంది హీరోలై ఉండొచ్చు. దిలీప్‌కుమార్ స‌ర్ మాలో స్పూర్తి నింపిన గొప్ప హీరో. సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఒక శ‌కం ఆయ‌న‌తో ముగిసిపోయింది. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి - అక్ష‌య్ కుమార్

Next Story