తమిళ హీరో విక్ర‌మ్‌కు గుండెపోటు

Chiyaan Vikram suffers heart attack admitted to hospital. తమిళ్ హీరో చియాన్‌ విక్రమ్‌కు గుండె పోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు విక్రమ్‌ను చెన్నైలోని కావేరీ

By అంజి  Published on  8 July 2022 3:23 PM IST
తమిళ హీరో విక్ర‌మ్‌కు గుండెపోటు

తమిళ హీరో చియాన్‌ విక్రమ్‌కు గుండె పోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు విక్రమ్‌ను చెన్నైలోని కావేరీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి విక్రమ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాల నుంచి సమాచారం. త్వరలోనే హెల్త్‌ బులెటిన్‌ వెలువడే అవకాశం ఉంది. ఈ వార్త తెలియగానే అభిమానులు ఆందోళనకు గురయ్యారు. నెటిజన్లు 'గెట్ వెల్ సూన్ విక్రమ్' అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతులైన హీరోలలో చియాన్ విక్రమ్ ఒకరు. తన నటనా నైపుణ్యంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు చెన్నైలో జరగాల్సిన 'పొన్నియిన్ సెల్వన్' టీజర్‌ లాంచ్‌ కార్యక్రమానికి విక్రమ్ హాజరుకావాల్సి ఉంది. ప్రస్తుతం ఈయన నటించి 'కోబ్రా' మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

Next Story