మరోసారి చిరు లీక్స్.. ఈసారి పవన్ కళ్యాణ్ గురించి!!

సోషల్ మీడియా యూజర్లకు చిరు లీక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆయన తప్పకుండా ఏదో ఒక కీలక సమాచారం ఇస్తూ ఉంటారు.

By M.S.R  Published on  13 Jun 2024 10:45 AM IST
Chiru leaks, Pawan Kalyan, Deputy Chief Minister, Andhrapradesh

మరోసారి చిరు లీక్స్.. ఈసారి పవన్ కళ్యాణ్ గురించి!! 

సోషల్ మీడియా యూజర్లకు చిరు లీక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆయన తప్పకుండా ఏదో ఒక కీలక సమాచారం ఇస్తూ ఉంటారు. రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమాకు సంబంధించిన సమాచారాన్ని.. ఆచార్య టైటిల్ ను చిరంజీవి ఓ ఈవెంట్ లో చెప్పేయడం.. ఇక ఆయన ట్వీట్స్ ద్వారా పలు విషయాలు.. ఇలా ఎన్నో చిరు లీక్స్ ద్వారా బయటకు వచ్చినవే. ఈ విషయంపై చిరంజీవి కూడా ఇప్పటికే స్పందించారు. దాచుకోలేకపోతున్నానని.. అందుకే బయటకు వచ్చేస్తూ ఉంటాయని వివరణ ఇచ్చారు.

ఇక పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ.. ఆయనకు కేటాయించిన శాఖ గురించి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా చిరంజీవి మాత్రం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటూ ట్వీట్ వేసేశారు. "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన @ncbn నారా చంద్రబాబునాయుడు గారికి, డిప్యూటీ సి ఎం @PawanKalyan కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను....ఆశిస్తున్నాను.!!" అంటూ చిరంజీవి ట్వీట్ వేశారు. అప్పటి వరకూ పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి అనే ప్రచారం జరిగింది తప్ప.. అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఈ ట్వీట్ ద్వారా పవన్ కళ్యాణ్ కు కేటాయించిన శాఖ ఏమిటో తెలిసొచ్చింది.

Next Story