చిరు 154 అప్‌డేట్ వ‌చ్చేసింది.. సంక్రాంతి బ‌రిలో మెగాస్టార్‌

Chiru 154 Movie to be out on Sankranthi 2023.మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌ను చేస్తూ పుల్ బిజీగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2022 7:05 AM GMT
చిరు 154 అప్‌డేట్ వ‌చ్చేసింది.. సంక్రాంతి బ‌రిలో మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌ను చేస్తూ పుల్ బిజీగా ఉన్నారు. చిరంజీవి చేతిలో ప్ర‌స్తుతం నాలుగు చిత్రాలు ఉన్నాయి. అందులో బాజీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ఒక‌టి. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. చిరంజీవి 154 చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓస‌రికొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. చిరంజీవి చేతిలో లంగ‌ర్లు ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. 'బాక్సాఫీస్ వేట‌కు లంగ‌రు త‌యారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి మెగా 154 విడుద‌ల కానుంది' అని ట్వీట్ చేసింది.

ఈ చిత్రంలో చిరుకి జోడిగా శృతిహాస‌న్ న‌టిస్తోండ‌గా, దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్ప‌టికే ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో చిరంజీవి ఈ చిత్రానికి 'వాల్తేరు వీర‌య్య' అనే పేరు పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. తాజాగా విడుద‌లైన పోస్ట‌ర్‌పై ఎటువంటి పేరు లేదు. త్వ‌ర‌లోనే వివ‌రాలు వెల్ల‌డిస్తాం అని చిత్ర‌బృందం తెలిపింది. మ‌రీ చిరంజీవి చెప్పిన టైటిలే ఉంటుందా..? వేరే టైటిల్‌ను పెడ‌తారా..? అనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే సంక్రాంతి రేసులో ప్ర‌భాస్ 'ఆదిపురుష్‌', రామ్‌చ‌ర‌ణ్-శంక‌ర్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మెగాస్టార్ అదే టైమ్‌కి వ‌చ్చేస్తున్నాడు. ఒక‌వేళ అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే.. తండ్రి, కొడుకులు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డనున్న‌ట్లే.

Next Story
Share it