తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

Chiranjeevi wishes to Pawan Kalyan.మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sep 2021 4:21 AM GMT
తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న కంటూ ఓ ప్ర‌త్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ప‌వ‌న్ పేరు వింటేనే చాలు అభిమానులు ఆనందంతో గంతులేస్తారు. ఆయ‌న క‌నిపిస్తే చాలు థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయేలా గోల చేస్తారు. హిట్లు, ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా ఆకాశాన్నంటే అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల‌వ‌ర‌కు ఎంతో మంది ప‌వ‌న్‌కు అభిమానులే. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన ప‌వ‌న్ సినిమాల‌తోనే కాకుండా.. వ్య‌క్తిత్వంతో ఎంతోమంది మ‌న‌సులు గెలుచుకున్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేడు 50వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. తాజాగా ఆయ‌న అన్న‌య్య మెగాస్టార్ చిరంజీవి.. ప‌వ‌న్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన.. ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం..కళ్యాణ్. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ చిరు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.


Next Story
Share it