హ‌నుమాన్ జ‌యంతి.. స్పెష‌ల్ వీడియో షేర్ చేసిన చిరంజీవి

Chiranjeevi shares Ram Charan's special video on Hanuman Jayanthi.ఆంజ‌నేయ స్వామికి మెగాస్టార్ చిరంజీవి ప‌ర‌మ భ‌క్తుడ‌ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 April 2022 6:59 AM GMT
హ‌నుమాన్ జ‌యంతి.. స్పెష‌ల్ వీడియో షేర్ చేసిన చిరంజీవి

ఆంజ‌నేయ స్వామికి మెగాస్టార్ చిరంజీవి ప‌ర‌మ భ‌క్తుడ‌ని అంద‌రికీ తెలిసిందే. శ‌నివారం హ‌నుమాన్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని చిరంజీవి.. ఓ స్పెష‌ల్ వీడియోను సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ వీడియోలో ఏం ఉందంటే.. ఆచార్య చిత్రం కోసం కాటేజీలో చరణ్ మేకప్ చేసుకుంటుండగా ఓ వానరం అక్కడకు వ‌చ్చింది. చరణ్ మేకప్ వేసుకున్నంత సేపు అది అక్క‌డే తారాడింది. చ‌ర‌ణ్ మేక‌ప్ వేసుకోవ‌డం పూర్తి అయిన త‌రువాత ఆ వాన‌రానికి బిస్కెట్లు అందించాడు. ఈ వీడియోకు శ్రీఆంజనేయం శ్లోకం అయిన‌ 'శ్రీ ఆంజనేయం.. ప్రసన్న ఆంజనేయం' ను జోడించి చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. హనుమాన్ జయంతి రోజున చిరు పోస్ట్ చేసిన ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం 'ఆచార్య‌'. ఇప్ప‌టికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. తండ్రీకొడుకులైన చిరంజీవి, చ‌ర‌ణ్‌లు క‌లిసి న‌టించిన ఈ చిత్రాన్ని చూసేందుకు మెగా అభిమానులు అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story
Share it