తార‌కర‌త్న ఆరోగ్యంపై చిరు ట్వీట్‌.. ఆ మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది

Chiranjeevi shares a tweet about Taraka Ratna Health Update.మెగాస్టార్ చిరంజీవి తార‌క‌ర‌త్న ఆరోగ్యంపై స్పందించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 Jan 2023 10:37 AM IST
తార‌కర‌త్న ఆరోగ్యంపై చిరు ట్వీట్‌.. ఆ మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది

బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్ప‌త్రిలో నంద‌మూరి తార‌క‌ర‌త్న చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న ఆరోగ్య హెల్త్ బులెటిన్‌ను ఆస్ప‌త్రి వ‌ర్గాలు విడుద‌ల చేశాయి. ఆరోగ్య ప‌రిస్థితి ఇంకా విష‌మంగానే ఉంద‌ని, వెంటి లేట‌ర్‌పై ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిపింది. ఆయ‌న‌కు ఎక్మో వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌లేదని, ఆయ‌న‌కు అత్యున్న‌త స్థాయి చికిత్స అందిస్తున్న‌ట్లు చెప్పింది. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు ఆరోగ్య స్థితిపై స‌మాచారాన్ని ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌జేస్తున్న‌ట్లు ఆ బులెటెన్‌లో పేర్కొంది.

తార‌క‌ర‌త్న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీట్లు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తార‌క‌ర‌త్న ఆరోగ్యంపై స్పందించారు. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ, ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. తెలుపుతున్న‌నంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

ఇటీవ‌ల కుప్పంలో నారా లోకేష్ పాద‌యాత్రలో పాల్గొన్న తార‌క‌ర‌త్న ఒక్కసారిగా కుప్ప‌కూలిపోయారు. తొలుత ఆయ‌న్ను కుప్పంలోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. అనంత‌రం మెరుగైన చికిత్స కోసం బెంగ‌ళూరులోని నారాయ‌ణ హృద‌యాల ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

Next Story