'బింబిసార' దర్శకుడితో చిరంజీవి నెక్స్ట్ మూవీ
ఒకట్రెండు సినిమాలకు అంగీకరించి, తిరస్కరించిన మెగాస్టార్ చిరంజీవి.. నెలల తరబడి అనిశ్చితి తర్వాత ఎట్టకేలకు
By అంజి Published on 12 April 2023 11:03 AM IST'బింబిసార' దర్శకుడితో చిరంజీవి నెక్స్ట్ మూవీ
ఒకట్రెండు సినిమాలకు అంగీకరించి, తిరస్కరించిన మెగాస్టార్ చిరంజీవి.. నెలల తరబడి అనిశ్చితి తర్వాత ఎట్టకేలకు తన తదుపరి సినిమాపై నిర్ణయం తీసుకున్నారు. చిరు ఇప్పుడు 'బింబిసార' దర్శకుడితో కలిసి పనిచేయడానికి అంగీకరించాడు. “బింబిసార” సినిమాతో తెరంగేట్రం చేసిన యువ దర్శకుడు వశిష్ట మెగాస్టార్‌ని మెప్పించే స్క్రిప్ట్ రాసుకున్నాడట. రీసెంట్‌గా వశిష్ట్ చెప్పిన స్టోరీ లైన్ చిరంజీవికి బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.
చిరంజీవి ప్రస్తుత చిత్రం "భోలా శంకర్" పూర్తయిన తర్వాత ఈ చిత్రం నిర్మాణం ప్రారంభమవుతుంది. యూవీ క్రియేషన్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ ఏడాది చిరంజీవి "వాల్తేరు వీరయ్య" సినిమాతో భారీ హిట్ కొట్టి ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ కి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చిరు నటిస్తున్న "భోలా శంకర్".. తమిళ్‌లో అజిత్ నటించిన ‘వేదాళం’ చిత్రానికి రీమేక్. మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ మూవీలో తమన్నా చిరుకు జోడిగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది.