నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవి : లీక్ చేసిన మెగాస్టార్

Chiranjeevi Leaks Nuvvu Sridevi Ayithey Song. మెగాస్టార్ చిరంజీవి మరో లీక్ తో ముందుకు వచ్చారు. 'వాల్తేరు వీరయ్య' సినిమా కోసం చాలా కష్టపడుతూ ఉన్నారు

By M.S.R  Published on  14 Dec 2022 6:22 PM IST
నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవి : లీక్ చేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి మరో లీక్ తో ముందుకు వచ్చారు. 'వాల్తేరు వీరయ్య' సినిమా కోసం చాలా కష్టపడుతూ ఉన్నారు చిరంజీవి. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ చేస్తూ వస్తోంది. ఆమెతో కలిసి మంచి మంచి పాటలకు చిరంజీవి చిందేస్తూ వస్తున్నారు. తాజాగా ఆ విషయాన్ని చిరంజీవి తన ఇంస్టాగ్రామ్ వీడియో ద్వారా చెప్పేశారు. సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ లో శృతి హాసన్ తో చేసిన పాట చాలా బాగా వచ్చిందని మెగా స్టార్ ఆ వీడియోలో తెలిపారు. లొకేషన్స్ చాలా బాగా ఉన్నాయి. మైన‌స్ 8 డిగ్రీల చలిలో పాటకు డ్యాన్స్ చేశామని చిరంజీవి అన్నారు. టీమ్ మొత్తం చాలా కష్టపడింది. మంచి మంచి విజువల్స్ ను నేను మీతో షేర్ చేసుకున్నానని చెప్పడమే కాకుండా.. ఓ విషయాన్ని లీక్ కూడా చేశారు చిరు.

అదేమిటంటే ఈ సినిమా లోని ఓ పాట.. ఇప్పటికే 'బాస్ పార్టీ' సాంగ్ దుమ్ము రేపుతూ ఉండగా.. మరో లిరికల్ సాంగ్ సినిమా నుండి రానుంది. అది 'నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవి' అనేది.. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ పాట కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ వస్తున్నారు. చిరంజీవి సరసన శ్రుతి హాసన్ నటిస్తున్న ఈ సినిమాలో, రవితేజ జోడీగా కేథరిన్ కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు.


Next Story