ఆయన కీర్తి అజరామరం.. కళాతపస్వి మృతి పట్ల ప్ర‌ముఖుల సంతాపం

Chiranjeevi, Jr NTR and others pay tribute to the legend.ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, క‌ళాత‌ప‌స్వి కె.విశ్వానాథ్ క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Feb 2023 9:47 AM IST
ఆయన కీర్తి అజరామరం.. కళాతపస్వి మృతి పట్ల ప్ర‌ముఖుల సంతాపం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, క‌ళాత‌ప‌స్వి కె.విశ్వానాథ్ క‌న్నుమూశారు. గ‌త కొద్ది రోజులుగా వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలియ‌జేస్తున్నారు.

కళాతపస్వి విశ్వనాథ్‌ ఇక లేరనే వార్త తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురిచేసిందని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. ఇది అత్యంత విషాదకరమైన రోజన్నారు. ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి మాటలు చాలవన్నారు.

‘ఇది అత్యంత విషాదకరమైన రోజు. పితృ సమానులు, కళాతపస్వి కే.విశనాథ్‌ గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి మాటలు చాలవు. పండితులని పామరులని కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. ఆయనలా సున్నితమైన ఆర్ట్‌ ఫిలిమ్స్‌ని కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు. తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహా దర్శకుడు ఆయన.

ఆయన దర్శకత్వంలో శుభలేఖ, స్వయంకృషి, ఆపద్బంధవుడు చిత్రాల్లో నటించే అవకాశం నాకు లభించింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో ఉన్న గురు శిష్యుల సంబంధం. అంతకు మించి తండ్రీ కొడుకుల అనుబంధం. ఆయనతో గడిపిన సమయం నాకు అత్యంత విలువైనది.ప్రతి నటుడికీ ఆయనతో పనిచేయడం ఒక ఎడ్యుకేషన్‌ లాంటిది. ఆయన చిత్రాలు భావి దర్శకులకు ఒక గైడ్‌ లాంటివి. 43 ఏండ్ల క్రితం ఆ మహనీయుడి ఐకానిక్‌ చిత్రం శంకరాభరణం విడుదలైన రోజునే బహుశా ఆ శకరుడికి ఆభరణంగా, ఆయన కైలాసానికి ఏతెంచారు. ఆయ చిత్రాలు, చిత్రాల సంగీతం, ఆయన కీర్తి అజరామరమైనవి. ఆయన లేనిలోటు భారతీయ చిత్ర పరిశ్రమకు, తెలుగు వారికి ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాధ్ గారిది ఉన్నతమైన స్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనుకుంటున్నాను. -ఎన్టీఆర్‌







Next Story