రామ్ చరణ్ పై జేమ్స్ కామెరాన్ ప్రశంసలు.. ఓ తండ్రిగా గర్వంగా ఉంది : చిరంజీవి

Chiranjeevi is proud father as 'cinematic genius' James Cameron praises Ram Charan. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకుంటూ ఉన్నారు.

By M.S.R  Published on  18 Feb 2023 9:15 PM IST
రామ్ చరణ్ పై జేమ్స్ కామెరాన్ ప్రశంసలు.. ఓ తండ్రిగా గర్వంగా ఉంది : చిరంజీవి

ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎంతో మంది ఐకానిక్ హాలీవుడ్ దర్శకులు కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను పొగడ్తల్లో ముంచెత్తారు. స్టీఫెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరాన్ లాంటి డైరెక్టర్స్ ఆర్ఆర్ఆర్ సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ ప్రశంసలు కురిపించారు.

ఇక కుమారుడిని పొగిడితే తండ్రికి ఆనందం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. ఈ పొగడ్త రామ్ చరణ్ కు ఆస్కార్ కంటే తక్కువేం కాదని అన్నారు. సినిమా రిలీజైన దగ్గర్నుంచి రోజుకో రికార్డుతో భారతీయ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిన ఆర్ఆర్ఆర్ మూవీని హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ మరోసారి కొనియాడారు. రామ్ చరణ్ క్యారెక్టర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మీ అంతటి గ్లోబల్ ఐకాన్, సినిమా మేధావి ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ను పొగడడం ఆస్కార్ అవార్డు కంటే తక్కువేమీ కాదని, రామ్ చరణ్ కు ఇదొక గొప్ప గౌరవమంటూ చిరు ట్వీట్ చేశారు. రామ్ చరణ్ ఈ స్థాయికి ఎదగడాన్ని ఓ తండ్రిగా గర్వంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు.


Next Story