చిరు ఫ్యామిలీ పిక్ వైర‌ల్‌.. స్పెష‌ల్ ఏంటంటే..?

Chiranjeevi family pic goes viral.తండ్రికి తగ్గ త‌న‌య‌గానే కాదు.. మెగా కోడలిగా కూడా ఉపాసన మంచి పేరు సంపాదించుకున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 July 2022 7:40 AM IST
చిరు ఫ్యామిలీ పిక్ వైర‌ల్‌.. స్పెష‌ల్ ఏంటంటే..?

తండ్రికి తగ్గ త‌న‌య‌గానే కాదు.. మెగా కోడలిగా కూడా ఉపాసన మంచి పేరు సంపాదించుకున్నారు. అపోలో సంస్థ‌ల ఉపాధ్యాక్షురాలు ఉపాసన పుట్టినరోజు (జూలై 20) వేడుక‌లు బుధ‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌లు అభిమానుల‌తో ఓ ఫోటోను పంచుకుంటూ ఉపాస‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

'మా ఇంటి కోడ‌లు పిల్ల ఉపాస‌న‌కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు' అని చిరంజీవి పేర్కొన‌గా.. 'నా ప్రియ‌మైన ఉపాస‌న హ్యాపీ బర్త్ డే' అంటూ చ‌ర‌ణ్ విషెస్ చెప్పారు. ఈ ఫొటోలో రామ్ చరణ్, ఉపాసనలతో పాటు మెగాస్టార్ చిరంజీవి, ఆమె సతీమణి సురేఖ కూడా ఉన్నారు. ఈ ఫోటో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. చిరు కుటుంబ స‌భ్యులు చిరు న‌వ్వులు చిందిస్తున్న ఈ ఫోటోని చూసి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.

ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొని మంచి మ‌న‌సును చాటుకున్నారు ఉపాస‌న‌. హార్ట్స్ బీటింగ్ పౌండేష‌న్ ద్వారా మ‌రో మంచి కార్య‌క్ర‌మానికి చేయూత‌నందిస్తున్న‌ట్లు ఆమె ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న సినిమా విష‌యానికి వ‌స్తే.. చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నారు.

Next Story