చిరంజీవి బర్త్‌ డే స్పెషల్‌.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న 'మెగా 157' పోస్టర్‌

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌ డే సందర్భంగా.. ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ని మేకర్స్‌ ప్రకటిస్తున్నారు.

By అంజి  Published on  22 Aug 2023 12:25 PM IST
Chiranjeevi, Film production, Tollywood, Mega157

చిరంజీవి బర్త్‌ డే స్పెషల్‌.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న 'మెగా 157' పోస్టర్‌

ఇవాళ మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌ డే సందర్భంగా.. ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ని మేకర్స్‌ ప్రకటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై చిరంజీవి 157వ సినిమా రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. మెగాస్టార్‌ కోసం పంచభూతాలు ఏకం కానున్నాయని క్యాప్షన్‌ ఇచ్చి, పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. పోస్టర్‌ని చూస్తుంటే.. ఇది సోషియో ఫాంటసీ సినిమా అని తెలుస్తోంది. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని చూపిస్తూ పోస్టర్‌ ఉంది. ఆ కాలచక్రం వెనకాల మెగా మాస్‌ ఉందంటూ పోస్టర్‌లో చిరుకు వీర లెవల్లో ఎలివేషన్‌ ఇచ్చారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎమ్‌.ఎమ్‌ కీరవాణి మ్యూజిక్‌ అందించనున్నారు. కాన్సెప్ట్‌ పోస్టర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 'బింబిసార' దర్శకుడు వశిష్ఠ దీనికి దర్శకత్వం వహించనున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి తన కూతురు సుస్మిత కొణిదెల సొంత బ్యానర్‌పై కూడా ఇవాళా క్లారిటీ వచ్చింది. వాటి వివరాలను ప్రొడక్షన్‌ హౌస్‌ షేర్‌ చేసి.. చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ''4 దశాబ్దాలుగా వెండితెరను శాసిస్తున్న రాజసం. తెరపైనే కాకుండా బయట కూడా బంధాలకు విలువ ఇచ్చే వ్యక్తి. తన తర్వాత సినిమా మా బ్యానర్‌లో చేస్తున్నాడని తెలియజేయడానికి సంతోషంగా ఉంది'' అని ‘గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ ట్వీట్‌ చేసింది. ఈ సినిమాకు కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తాడని టాక్‌ వినిపిస్తోంది. అయితే.. దీనికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాణ సంస్థ పేర్కొంది. కాగా ఈ రెండు సినిమాలను నెలల గ్యాప్‌లోనే రిలీజ్‌ చేసుకునే విధంగా షూటింగ్‌ను ప్లాన్‌ చేసుకుంటున్నారట చిరంజీవి.

Next Story