ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, సింగర్ కార్తీక్‌లకు అవకాశాలు ఇవ్వడంపై సింగర్ చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు. ‘‘జానీ మాస్టర్, సింగర్ కార్తీక్ వంటి వాళ్లకు ఇండస్ట్రీలో మరోసారి అవకాశాలు ఇవ్వడం అంటే లైంగిక వేధింపులకు మద్దతు తెలపడమే. డబ్బును అధికారాన్ని దుర్వినియోగం చేసే వారి చేతుల్లో పెట్టొద్దు. మనం నమ్మే కర్మ సిద్ధాంతం నిజమైతే.. కర్మ అసలు ఎవరినీ వదిలిపెట్టదు’’ అని రాసుకొచ్చారు.
చిన్మయి మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా గళం విప్పుతూ ఉంటారు. తన తాజా X పోస్ట్‌లో, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, గాయకుడు కార్తీక్‌లపై విమర్శలు గుప్పించారు. జానీ కార్తీక్ ఇ,ద్దరూ చిన్మయి పోస్ట్‌పై ఇంకా స్పందించలేదు.