చిరంజీవికి చిన్మయి కౌంటర్..!

కాస్టింగ్ కౌచ్ అంశం టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

By -  Medi Samrat
Published on : 27 Jan 2026 8:00 PM IST

చిరంజీవికి చిన్మయి కౌంటర్..!

చిరంజీవికి చిన్మయి కౌంటర్..!

కాస్టింగ్ కౌచ్ అంశం టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని, కొత్త ప్రతిభను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తారని అన్నారు. ఇండస్ట్రీలో ఆడైనా, మగైనా రాణించాలంటే ముందుగా ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ ఎవరికైనా చేదు అనుభవాలు ఎదురైతే, అది తప్పకుండా ఆ వ్యక్తి ప్రవర్తనతో సంబంధం ఉంటుందని తాను నమ్ముతానని ఆయన అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది వ్యవస్థాగతంగా లేదని, వ్యక్తుల బిహేవియర్‌ను బట్టే పరిణామాలు జరుగుతాయని, నువ్వు స్ట్రిక్ట్‌గా, ప్రొఫెషనల్‌గా ఉంటే ఎవడూ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించడు. నీ అభద్రతాభావం వల్లే అవతలివాళ్లు అలా అనుకోవచ్చు. కానీ నువ్వు క్లియర్‌గా ఉంటే అవతలివాళ్లు కూడా అలాగే ఉంటారని చిరంజీవి అన్నారు. ఈ వ్యాఖ్యలపై గాయని చిన్మయి తీవ్రంగా స్పందించారు.

సినీ పరిశ్రమలో ' ఫుల్ కమిట్మెంట్ ' అనే పదానికి వేరే అర్థం ఉందని గాయని చిన్మయి శ్రీపాద అన్నారు. క్యాస్టింగ్ కౌచ్‌ అనేది చాలా విస్తృతంగా ఉందని, మహిళలు ఫుల్ కమిట్మెంట్ అన్నది ఇవ్వకపోతే వారికి అవకాశాలు లభించడం లేదని తేల్చి చెప్పారు. ఆంగ్ల విద్య అభ్యసించిన బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చి 'కమిట్మెంట్' అంటే వృత్తి నైపుణ్యం, పనిపట్ల అంకితభావం అని భావిస్తే, అది తప్పు అని ఆమె వివరించారు.

Next Story