టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుతు ప్రభు మయోసైటిస్ బారిన పడిన తర్వాత సినిమాలు తగ్గించేశారు. ఇటీవలే వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్ బన్నీ వెబ్ సిరీస్‌తో ఆమె మెప్పించారు. అయితే ఆ వెబ్ సిరీస్‌కు పబ్లిక్ నుంచి సరైన రెస్పాన్స్ రాలేదని టాక్. సినిమాలు తక్కువగా చేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు సమంత. తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలకు సంబంధించిన సమాచారాన్ని అందులో షేర్ చేస్తూ ఉంటారు. అటు గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ పిక్చర్స్‌ను కూడా సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తోంది.
ఈ క్రమంలో సమంత లేటెస్ట్‌గా షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ స్టోరీ పెట్టిన ఆమె జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న పిక్‌ను షేర్ చేసింది. చికెన్ గున్యా కారణంగా వచ్చిన కీళ్ల నొప్పుల నుంచి కోలుకోవడం అనేది చాలా ఫన్‌గా ఉంటుందని పోస్టు పెట్టారు. పోస్టులో ఎమోజీస్ కూడా యాడ్ చేశారు. సమంత షేర్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి మూవీ టైమ్‌లో తాను మయోసైటిస్ వ్యాధి బారినపడినట్లు సమంత చెప్పారు. అప్పటి నుంచి తన ఆరోగ్యం క్షీణించిందని పలు సందర్భాల్లో వివరించారు. మయోసైటిస్ ట్రీట్ మెంట్ కోసం మెడిసిన్స్, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం లాంటి రకరకాల పద్ధతులను ఆమె ఫాలో అయ్యారు.