'చక్దా ఎక్స్‌ప్రెస్'.. టీజ‌ర్ అదిరిపోయింది

Chakda Xpress Teaser Out.భార‌త మ‌హిళా జ‌ట్టు మాజీ కెప్టెన్‌, స్టార్ పేస‌ర్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jan 2022 9:09 AM GMT
చక్దా ఎక్స్‌ప్రెస్.. టీజ‌ర్ అదిరిపోయింది

భార‌త మ‌హిళా జ‌ట్టు మాజీ కెప్టెన్‌, స్టార్ పేస‌ర్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో 'చక్దా ఎక్స్‌ప్రెస్' అనే చిత్రం తెర‌కెక్కుతోంది. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శ‌ర్మ న‌టిస్తోంది. ఓటీటీ వేదిక‌గా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. కాగా.. ఈ చిత్ర టీజ‌ర్‌ను న‌టి అనుష్క శ‌ర్మ సోష‌ల్ మీడియాలో గురువారం విడుద‌ల చేసింది. టీమ్ఇండియా క్రికెట‌ర్‌గా ఎదిగే క్ర‌మంలో జుల‌న్ గోస్వామి ఎన్ని స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నారు. ఎన్ని క‌ష్టాల‌ను చ‌విచూశార‌నే క‌థాంశంతో వాస్త‌విక ప‌రిస్థితుల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న‌ట్లు అనుష్క చెప్పుకొచ్చింది.

'ఈ చిత్రం నిజంగా నాకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం. ఎందకంటే గోస్వామి వంటి స్టార్‌ బౌలర్‌ జీవిత ఆధారంగా తెరక్కెతుంది. ఇటువంటి పాత్రలో నటించడం నా అదృష్టం. చక్దా ఎక్స్‌ప్రెస్ చిత్రం మహిళా క్రికెట్‌ విలువను ప్రపంచానికి తెలియజేస్తుంది' అని అనుష్క శర్మ రాసుకొచ్చింది. కాగా.. ఇప్ప‌టికే మిథాలీరాజ్ బ‌యోపిక్ తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రంలో మిథాలీ పాత్ర‌లో తాప్సీ న‌టిస్తోంది. ఇక జుల‌న్ గోస్వామి విష‌యానికి వ‌స్తే.. భారత్‌ తరుపున 12 టెస్టులు, 192 వన్డేలు, 68 టీ20 ఆడిన గోస్వామి వరుసగా 44, 240, 56 వికెట్లు సాధించింది.

Next Story
Share it