బ‌ప్పీ ల‌హిరి మృతి ప‌ట్ల ప్ర‌ముఖుల సంతాపం

Celebrities condolences to Bappi Lahiri.1980, 90 దశకాలలో డిస్కో మ్యూజిక్‌తో దేశాన్ని ఉర్రూతలూగించిన ప్రముఖ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2022 8:01 AM GMT
బ‌ప్పీ ల‌హిరి మృతి ప‌ట్ల ప్ర‌ముఖుల సంతాపం

1980, 90 దశకాలలో డిస్కో మ్యూజిక్‌తో దేశాన్ని ఉర్రూతలూగించిన ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీలహరి అనారోగ్యంతో ముంబైలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉద‌యం క‌న్నుమూశారు. ఆయ‌న ఇక లేర‌న్న వార్త సినీ ఇండ‌స్ట్రీని తీవ్రంగా క‌లిచివేసింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లువురు ప్ర‌ముఖులు బ‌ప్పీ ల‌హిరి మృతి ప‌ట్ల సంతాపం తెలియ‌జేశారు.

'అద్భుత‌మైన సంగీత ద‌ర్శ‌కుడు బ‌ప్పీ ల‌హిరి ఆక‌స్మిక మ‌ర‌ణం బాధాక‌రం. భార‌త‌దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఆయ‌న పాట‌లు విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాయి. పాట‌ల రూపంలో ఆయ‌న ఎప్ప‌టికీ అభిమానుల మ‌దిలో నిలిచే ఉంటారు' - రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కొవింద్‌

'బప్పి లాహిరి జీ సంగీతం పూర్తిగా మనల్ని ఆవరించి, వైవిధ్యమైన భావోద్వేగాలను అందంగా వ్యక్తీకరిస్తుంది. ఎంతోమంది వయసు బేధం లేకుండా ఆయన సంగీతాన్ని ఇష్టపడతారు. ఆయన మరణంతో అతని సజీవ స్వభావాన్ని అందరూ మిస్ అవుతారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి' - ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

'దిగ్గజ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహిరి మరణం తీవ్ర వేదనను కలిగించింది… నాకు బప్పి డాతో గొప్ప అనుబంధం ఉంది. అతను నా కోసం అనేక చార్ట్‌బస్టర్‌లను అందించాడు. అవి నా సినిమాలు హిట్ కావడానికి ఎంతగానో దోహదం చేశాయి. బప్పి యూనిక్ స్టైల్, జీవితం పట్ల గొప్ప ఉత్సాహం ఆయన మ్యూజిక్ లో ప్రతిబింబిస్తుంది. ఆయన సన్నిహితులకు, ప్రియమైన వారందరికీ నా హృదయపూర్వక సానుభూతి' - మెగాస్టార్ చిరంజీవి

'భారతదేశపు లెజెండరీ సంగీత స్వరకర్తలలో ఒకరైన శ్రీ బప్పి లహిరి మరణం విచార కరం. ఆయన పాటలు కీలక పాత్ర పోషించిన 3 సూపర్ హిట్ సినిమాలకు ఆయనతో కలిసి పనిచేసిన ఘనత కలిగింది. అతనితో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన కుటుంబానికి దేవుడు దైర్యన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను' - మోహ‌న్ బాబు

'సంగీత దర్శకుడు, గాయకుడు బప్పిలహిరి మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. నేను నటించిన రౌడీ ఇన్ స్పెక్టర్, నిప్పురవ్వ వంటి చిత్రాలకు బప్పి లహిరి సంగీతం అందించారు. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటూ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' - బాల‌కృష్ణ‌


Next Story
Share it