ప్రముఖ నిర్మాత ప్రితీశ్ కన్నుమూత
ప్రముఖ కవి, రచయిత, నిర్మాత ప్రితీశ్ నంది.. బుధవారం నాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు.
By అంజి Published on 9 Jan 2025 7:35 AM IST
ప్రముఖ నిర్మాత ప్రితీశ్ కన్నుమూత
ప్రముఖ కవి, రచయిత, నిర్మాత ప్రితీశ్ నంది.. బుధవారం నాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. ఆయన కుమారుడు కుషన్ నంది ఈ వార్తను ధృవీకరించారు. తానొక మంచి స్నేహితుడిని కోల్పోయానంటూ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఇన్‌స్టా పోస్ట్ ద్వారా తెలిపారు. నందిని.. అతని సృజనాత్మక నైపుణ్యానికి మాత్రమే కాకుండా అతని వ్యక్తిగత లక్షణాలకు కూడా గుర్తు చేసుకున్నారు. తనకు అత్యంత ప్రియమైన, అత్యంత సన్నిహిత మిత్రులలో ఒకరైన ప్రితీష్ నంది మరణం గురించి తెలుసుకుని తీవ్ర విచారం, దిగ్భ్రాంతికి గురయ్యానని అనుపమ్ ఖేర్ తెలిపారు.
ప్రితీశ్ తన నిర్మాణ సంస్థ ద్వారా ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, మీరాబాయ్ నాటౌట్, అగ్లీ ఔర్ పాగ్లీ, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ వంటి చిత్రాలు నిర్మించారు. జర్నలిస్టుగానూ సుపరిచితుడైన ప్రితీశ్ టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి తదితర సంస్థల్లో పని చేశారు. ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా ఎడిటర్‌గా పనిచేశారు. నంది యొక్క సాహిత్య రచనలకు కూడా ఎంతో పేరు వచ్చింది. పాత్రికేయ, సాహిత్య రంగాలకు అతీతంగా సినీ నిర్మాతగా కూడా నంది తనదైన ముద్ర వేశారు. గతంలో ఆయన రాజ్యసభ ఎంపీగానూ వ్యవహరించారు. జంతు హక్కుల కోసం పోరాడారు. జంతు సంక్షేమ సంస్థ అయిన పీపుల్ ఫర్ యానిమల్స్ సహ వ్యవస్థాపకుడిగా ప్రితీశ్ నంది ఉన్నారు.