టాలీవుడ్ హీరోపై కేసు నమోదు.. ఏం చేశాడంటే.!
Case registered against Tollywood hero Arun Kumar. టాలీవుడ్ సినిమా హీరో దాసరి అరుణ్ కుమార్‌ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
By అంజి Published on
20 Jan 2022 9:14 AM GMT

టాలీవుడ్ సినిమా హీరో దాసరి అరుణ్ కుమార్‌ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ర్యాష్ డ్రైవింగ్ కేసులో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో అరుణ్ కుమార్ కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రెండు బైక్‌లను ఢీ కొట్టాడు. ఈ ఘటన సయ్యద్ నగర్‌లో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. అరుణ్‌కుమార్‌కు పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయనున్నారు.
ప్రస్తుతం సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక వేళ మద్యం సేవించినట్లు తెలిస్తే.. కఠిన్య చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. దాసరి అరుణ్ కుమార్ పలు సినిమాల్లో హీరోగా నటించాడు. దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు కుమారుడు. గతంలో కూడా అరుణ్ కుమార్‌పై పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. దాసరి నారాయణ రావు మరణించిన తర్వాత.. అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు కూడా చెలరేగాయి.
Next Story