తండ్రీ, కొడుకుపై చీటింగ్ కేసు నమోదు
Case Registered against Film producer Bellamkonda Suresh and his son.టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, ఆయన
By తోట వంశీ కుమార్ Published on
11 March 2022 12:18 PM GMT

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, ఆయన తండ్రి నిర్మాత బెల్లంకొండ సురేష్ మీద సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రవణ్ అనే వ్యక్తి బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. సినిమా నిర్మిస్తున్నానంటూ బెల్లం కొండ సురేష్, శ్రీనివాస్‌లు 2018లో తన వద్ద రూ.50 లక్షలు అప్పుగా తీసుకున్నారని, ఆ తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా అంటూ నమ్మించి మరి కొంత నగదు తీసుకున్నారని శ్రవణ్ ఆరోపించారు. ఇలా విడుదల వారిగా తన వద్ద రూ.85లక్షలు తీసుకుని మోసం చేశారని నాంపల్లి కోర్టును శ్రవణ్ ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన న్యాయస్థానం ఇద్దరిపైనా కేసు నమోదు చేయాలని సీసీఎస్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్‌లపై సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం ఛత్రపతి హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడు. వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
Next Story