దాసరి కుమారుడు అరుణ్‌పై అట్రాసిటీ కేసు

Case files on Dasari son Arun in Banjarahills police station.దివంగత ద‌ర్శ‌కుడు దాసరి నారాయణరావు చిన్న కుమారుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Aug 2021 1:23 PM IST
దాసరి కుమారుడు అరుణ్‌పై అట్రాసిటీ కేసు

దివంగత ద‌ర్శ‌కుడు దాసరి నారాయణరావు చిన్న కుమారుడు దాసరి అరుణ్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో అట్రాసిటీ కేసు న‌మోదైంది. న‌ర్సింహులు అనే వ్య‌క్తి ఈ కేసు పెట్టారు. వివ‌రాల్లోకి వెళితే.. బొల్లారానికి చెందిన నర్సింహులు వెంకటేష్‌ అనే టెక్నీషియన్‌ 2012 నుంచి 2016 వరకు దాసరి నారాయణరావు వద్ద మూవీ రిస్టోరేషన్‌ ఔట్‌సోర్సింగ్‌ పనులు చేశారు. దాసరి కుమారులు ప్రభు, అరుణ్‌కుమార్ బాగా పరిచయం.

ఆ ప‌నికి ఇవ్వాల్సిన డబ్బుల విష‌యంలో వివాదం కొన‌సాగుతోంది. డ‌బ్బులు ఇస్తామ‌ని ఇంటికి పిలిచి కులం పేరుతో దాసరి అరుణ్ త‌న‌ను దూషించాడ‌ని రెండురోజుల ముందు న‌ర్సింహులు బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌గా.. పోలీసులు కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు.కాగా.. గత నెలలో దాసరి ఇద్దరు కుమారులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆర్థిక పరమైన లావాదేవీలపై తనను బెదిరించినట్లు సోమేశ్వర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Next Story