భీమ్లా నాయ‌క్ ఇన్ బ్రేక్‌ టైం.. వీడియో వైర‌ల్‌

Break time in Bheemla Nayak video viral.ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వరుస చిత్రాల‌తో పుల్ బిజీగా ఉన్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Aug 2021 5:58 AM GMT
భీమ్లా నాయ‌క్ ఇన్ బ్రేక్‌ టైం.. వీడియో వైర‌ల్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వరుస చిత్రాల‌తో పుల్ బిజీగా ఉన్నారు. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న భీమ్లానాయ‌క్ చిత్రంలో న‌టిస్తున్నారు. మ‌ల‌యాళ రీమేక్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న ఈచిత్రంలో రానా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం రానా-ప‌వ‌న్ క‌ళ్యాణ్ షూట్‌లో పాల్గొంటున్నారు. కాగా.. షూటింగ్‌లో చిన్న విరామం దొర‌క‌డంతో ప‌వ‌న్ గ‌న్ చేత ప‌ట్టారు. టార్గెట్‌ను ఎయిమ్ చేస్తూ బుల్లెట్ల వ‌ర్షం కురిపించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర‌బృందం అభిమానుల‌తో పంచుకుంది. భీమ్లా నాయ‌క్ ఇన్ బ్రేక్ టైమ్ అని రాసుకొచ్చింది. ఆ త‌ర్వాత గ‌న్ ప‌ట్టుకొని సోలోగా న‌డుస్తుండ‌గా, యెగి క‌మండ‌లం కొమ్ములోంచి చెట్ల‌కు ప్రాణ‌ధార‌లు వ‌దులుతాడు..యోధుడు తుపాకి గొట్టం నుండి ప్ర‌కృతికి వ‌త్తాసు ప‌లుకుతాడు. నాయ‌కుడు ఈ రెండింటిని త‌న భుజాన మోసుకుంటూ ముందుకు సాగుతాడు అని ప‌వ‌న్ ఉద్దేశించి సూక్తులు రాసారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా.. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story