బాస్​ పార్టీ సాంగ్.. ఎలా ఉందో బాస్ ఫ్యాన్స్ చెప్పాలి

Boss Party song from Waltair Veerayya. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా డైరెక్టర్‌ కేఎస్‌ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'

By M.S.R  Published on  23 Nov 2022 6:33 PM IST
బాస్​ పార్టీ సాంగ్.. ఎలా ఉందో బాస్ ఫ్యాన్స్ చెప్పాలి

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా డైరెక్టర్‌ కేఎస్‌ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన 'బాస్​ పార్టీ' సాంగ్ ​విడుదలైంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటను కంపోజ్ చేశాడు. ఈ పాట రాసింది కూడా దేవిశ్రీ ప్రసాద్ కావడం మరో విశేషం. నకాష్ అజీజ్, హరిప్రియ ఆలపించారు. మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ కు సంబంధించిన మూమెంట్స్ కొన్ని ఇందులో చూపించి ఊరించారు. చిరంజీవి మంచి మాస్ లుక్ లో కనిపించగా.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈ పాటలో తళుక్కుమంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.


శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న మాస్ చిత్రం "వాల్తేరు వీరయ్య". మెగాస్టార్ తో పాటుగా మాస్ మహారాజ రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.


Next Story