కాకినాడలో బాలీవుడ్ స్టార్
Bollywood star Aamir khan at Kakinada.బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఆమిర్ ఖాన్ ఒకరు. విభిన్న చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్‌లోనే
By తోట వంశీ కుమార్ Published on 13 Aug 2021 9:35 AM ISTబాలీవుడ్ స్టార్ హీరోల్లో ఆమిర్ ఖాన్ ఒకరు. విభిన్న చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్‌లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. ఆస్కార్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్, హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ 'ఫారెస్ట్‌గంప్' చిత్రానికి హిందీ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన ఆర్మీ ఆఫీసర్ బాలాగా కనిపించనున్నారు. ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు రూపొందిస్తున్న ఈ కామెడీ-డ్రామా చిత్రంలో కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది. రూ.105 కోట్ల బడ్జెతో నిర్మితమవుతోన్న ఇందులో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ చిత్ర షూటింగ్ నిమిత్తం అమీర్ ఖాన్ కాకినాడ వచ్చారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత కాకినాడ చేరుకున్న ఆయన సరోవర్ పోర్ట్‌కో హోటల్‌లో బస చేశారు. గురువారం మొత్తం ఆయన బయటకు రాకపోవడంతో ఆయన అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. శుక్రవారం నుంచి కాకినాడ– ఉప్పాడ, బీచ్, పోర్టు, అమలాపురం సమీపంలో ఓడలరేవు బీచ్, ఇతర ప్రముఖ ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ జరగనుంది. ఇప్పటికే కార్గిల్, లడఖ్, శ్రీనగర్ లొకేషన్స్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌లో పాల్గొన్నాడు చైతన్య. ఈ షెడ్యూల్స్‌లో ఆమిర్, చైతన్యలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు చిత్రదర్శకుడు అద్వైత్ చందన్. దాదాపు 15 రోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం