సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు.. రూ.5 కోట్లు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని..
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
By అంజి Published on 18 Oct 2024 11:35 AM ISTసల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు.. రూ.5 కోట్లు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని..
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. వర్లి పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) కింద బెదిరింపుకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం మధ్యాహ్నం నగరంలోని ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు వాట్సాప్ హెల్ప్‌లైన్‌లో బెదిరింపు వచ్చినట్లు ఆయన తెలిపారు. సందేశం పంపిన వ్యక్తి నటుడిని బెదిరించాడు. అతని నుండి రూ. 5 కోట్లు డిమాండ్ చేసాడు. విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.
ఇంతకుముందు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సూపర్ స్టార్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. ఏప్రిల్‌లో నటుడి బాంద్రా ఇంటి వెలుపల బిష్ణోయ్ ముఠా సభ్యులు కాల్పులు జరిపారని అధికారి చెప్పారు. ఇదిలావుండగా, జూన్‌లో బిష్ణోయ్ గ్యాంగ్.. సల్మాన్ ఖాన్‌ను హతమార్చడానికి పథకం వేసినట్లు నవీ ముంబై పోలీసులు గురువారం బయటపెట్టారు. దాని షూటర్లలో ఒకరిని హర్యానాలోని పానిపట్‌కు చెందిన సుఖ్‌బీర్ సింగ్‌గా గుర్తించినట్లు ఆయన తెలిపారు.
హర్యానా వ్యక్తి అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన నిందితుడిని నవీ ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడు సుఖాను హర్యానాలోని పానిపట్ నుంచి పట్టుకున్నట్లు అధికారి తెలిపారు. నవీ ముంబైకి తీసుకొచ్చిన అనంతరం గురువారం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఏడాది జూన్‌లో నవీ ముంబైలోని పన్వెల్ సమీపంలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లే మార్గంలో నటుడిని లక్ష్యంగా చేసుకునేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు పేర్కొన్నారు. 2024 ఏప్రిల్‌లో ముంబైలోని అతని బాంద్రా నివాసం వెలుపల కాల్పులు జరిగిన తరువాత ఈ పరిణామం జరిగింది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తనను, అతని కుటుంబ సభ్యులను చంపాలనే ఉద్దేశ్యంతో తన నివాసంపై కాల్పులు జరిపిందని తాను నమ్ముతున్నానని సల్మాన్ ఖాన్ ఈ ఏడాది ప్రారంభంలో పోలీసులకు చెప్పాడు.
ఈ ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు ఇక్కడి కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో నటుడి వాంగ్మూలం ఉంది. 2024 జనవరిలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ గుర్తింపులను ఉపయోగించి పన్వెల్ సమీపంలోని తన ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారని నటుడు పేర్కొన్నాడు.
2022లో, తన భవనం ఎదురుగా ఉన్న బెంచ్‌పై బెదిరింపు లేఖ కనిపించగా, మార్చి 2023లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తమకు ఇమెయిల్ బెదిరింపు వచ్చిందని ఖాన్ పోలీసులకు తెలిపారు.