డబ్బులు-ఫేమ్ కోసమే పెళ్లిళ్లు చేసుకుంటారు: బాలీవుడ్ నటి

బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఒక పోడ్‌కాస్ట్‌లో సంచలన విషయాలను వెల్లడించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 14 April 2024 6:37 PM IST

bollywood, actress nora fatehi,  cinema,

డబ్బులు-ఫేమ్ కోసమే పెళ్లిళ్లు చేసుకుంటారు: బాలీవుడ్ నటి 

బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఒక పోడ్‌కాస్ట్‌లో సంచలన విషయాలను వెల్లడించింది. సినిమా పరిశ్రమలోని కొంతమంది వ్యక్తులు ప్రేమ ఉండి.. వివాహం చేసుకోరని.. కేవలం 'డబ్బు' కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటారని తెలిపింది. ఓ వర్గం.. సర్కిల్‌లలో ఉండాలనే ఉద్దేశ్యంతోనే పెళ్లిళ్లు చేసుకుంటారంటూ సంచలన విషయాన్ని బయట పెట్టింది. తన ముందే ఇలాంటివి జరగడం చూశానని నోరా తెలిపింది. కొందరు తమ భాగస్వాముల ద్వారా నెట్‌వర్క్, కాంటాక్ట్స్ కోసం కూడా ఉపయోగించుకుంటారని సూపర్ డ్యాన్సర్ నోరా బయట పెట్టింది.

పరిశ్రమలోని కొందరు వ్యక్తులు డబ్బు కోసం పెళ్లి చేసుకుంటారని తెలిపింది. ఎవరి పేరు చెప్పకుండా నోరా ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ జంటల్లో కొందరు.. తమ భార్యలను.. లేదా భర్తలను నెట్‌వర్కింగ్, సర్కిల్‌ల కోసం, డబ్బు కోసం మాత్రమే ఉపయోగిస్తారు. ప్రేమించని వ్యక్తిని పెళ్లి చేసుకుని ఏళ్ల తరబడి జీవించడం కంటే దారుణం ఏమీ ఉండదు. మన ఇండస్ట్రీలో చాలా మంది ఆ పనికిమాలిన పని చేస్తున్నారని తెలిపింది నోరా. వ్యక్తిగత జీవితాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, ఆనందాన్ని త్యాగం చేయడం నాకు అసలు అర్థం కాలేదని తెలిపింది నోరా.

Next Story