ఇదేక్కడి ఫొటోషూట్‌ రా మావా.. ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న రణ్‌వీర్‌ నగ్న ఫొటోలు

Bollywood actor ranveer singh latest photoshoot breaking the internet. బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉన్న నటుడు రణ్‌వీర్‌ సింగ్. నిత్యం ఏదో ఒక విధంగా రణ్‌వీర్‌ వార్తల్లో నానుతూనే ఉంటాడు.

By అంజి  Published on  22 July 2022 10:24 AM IST
ఇదేక్కడి ఫొటోషూట్‌ రా మావా.. ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న రణ్‌వీర్‌ నగ్న ఫొటోలు

బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉన్న నటుడు రణ్‌వీర్‌ సింగ్. నిత్యం ఏదో ఒక విధంగా రణ్‌వీర్‌ వార్తల్లో నానుతూనే ఉంటాడు. ఇటీవలే డిస్కవరీ వైల్డ్‌ షోలో బేర్‌గ్రిల్స్‌కు ముద్దు పెట్టి దుమారం రేపాడు. తాజాగా న్యూడ్‌ ఫొటో షూట్‌ చేసి మరోసారి సంచలనం రేపుతున్నారు. తన తాజా ఫోటోషూట్‌లో నగ్నంగా కనిపించడం చర్చనీయాంశంగా మారింది. 'పేపర్‌' మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ రణ్‌వీర్‌ నగ్నంగా ఫొటో షూట్‌ చేశాడు. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

త్వరలో 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో కనిపించనున్న రణవీర్ సింగ్.. పేపర్ మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోటోషూట్ చేశాడు. రణ్‌వీర్‌ ఫోటోషూట్‌ పిక్స్‌ ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్నాయి. అతని ఫొటోలు వైరల్‌గా మారాయి. ఫొటోల్లో రణ్‌వీర్ నగ్నంగా టర్కిష్ రగ్గుపై పోజులిచ్చారు. అతని ఫోటోషూట్ కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం ఇలాంటి నగ్నంగా షూట్ చేసిన బర్ట్ రేనాల్డ్స్ నుండి ప్రేరణ పొందింది. పేపర్‌ మ్యాగజైన్‌కు రణ్‌వీర్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాలు, తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు.

"భౌతికంగా నగ్నంగా ఉండటం నాకు చాలా సులభం. అయితే ఇప్పటి వరకూ నేను సినిమాల్లో చేసిన పర్ఫార్మెన్స్‌లలోనూ నగ్నంగానే ఉన్నాను. అందులో మీరు నగ్నంగా ఉన్న నా ఆత్మను చూడొచ్చు. నిజానికి అదీ నగ్నత్వం అంటే. నేను వేయి మంది ముందు కూడా నగ్నంగా నిలబడగలను. నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. వాళ్లే కాస్త అసౌకర్యానికి గురవుతారు" అని రణ్‌వీర్‌ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Next Story