క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. సామాన్యులు, సెల‌బ్రెటీలు అన్న తేడాలేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. ఇక సినీ ఇండ‌స్ట్రీని కూడా ఈ మ‌హ‌మ్మారి వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే సినీ ఇండ‌స్ట్రీకి చెందిన చాలా మంది న‌టీ, న‌టుల‌కు క‌రోనా సోకింది. కొంద‌రు ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకోగా.. మ‌రికొంద‌రు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు బిక్రమ్‌జీత్ కన్వర్‌పాల్ క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని డైరెక్ట‌ర్ అశోక్ పండిత్ ట్వీట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.

52 ఏళ్ల బిక్ర‌మ్ జీత్ రిటైర్డ్ మేజ‌ర్‌. కొద్ది రోజుల క్రితం ఆయ‌నకు క‌రోనా సోకింది. చికిత్స పొందుతూ.. ప‌రిస్థితి విష‌మించ‌డంతో శ‌నివారం మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఇక 2003లో బిక్ర‌మ్ జీత్ త‌న యాక్టింగ్ కెరీర్ ప్రారంభించాడు. ఎన్నో సినిమాలు, సీరియ‌ళ్లు, వెబ్‌సిరీస్‌ల‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో బిక్ర‌మ్ న‌టించాడు. 'పేజ్ 3', 'ఆరాక్షన్', 'ప్రేమ్ రతన్ ధన్ పయో', 'జబ్ తక్ హై జాన్', '2 స్టేట్స్' సహా పలు విజయవంతమైన చిత్రాలలో ఆయన భాగమయ్యారు. అతని చివరి చిత్రం రానా దగ్గుబాటి మరియు తాప్సీ పన్నూ నటించిన 'ది ఘాజి ఎటాక్'.
తోట‌ వంశీ కుమార్‌

Next Story