హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు కోసం బాలీవుడ్ స్టార్ వచ్చేశాడు

Bobby Deol comes on board for Hari Hara Veera Mallu.ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Dec 2022 1:54 PM IST
హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు కోసం బాలీవుడ్ స్టార్ వచ్చేశాడు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న చిత్రం 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'. పిరియాడిక్‌ యాక్షన్ అడ్వెంచర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఎఎం ర‌త్నం స‌మ‌ర్ప‌ణ‌లో మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్ ప‌తాకంపై ఎ ద‌యాక‌ర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ఎమ్‌ఎమ్ కీర‌వాణి సంగీతాన్ని అందిస్తుండ‌గా న‌ర్గీస్ ఫ‌క్రి ఓ కీల‌క పాత్ర‌లో మెర‌వ‌నుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ప‌వ‌న్ లుక్‌, గ్లింప్స్‌లు అభిమానుల‌ను విప‌రీతంగా ఆకట్టుకున్నాయి.

శ‌ర‌వేగంగా ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతోంది. తాజాగా ఈ చిత్ర సెట్‌లోకి బాలీవుడ్ స్టార్ న‌టుడు బాబీ డియోల్ అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో బాబీ డియోల్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆయ‌న‌కు సంబంధించిన స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన‌డానికి నేడు హైద‌రాబాద్ వ‌చ్చారు. ఈ చిత్రంలో బాబీ డియోల్ ఔరంగ‌జేబు పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి ఈ పాత్ర‌ను అర్జున్ రామ్‌పాల్ చేయాల్సి ఉంది. అయితే.. ఆయ‌న కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ చిత్రం నుంచి త‌ప్పుకున్నారు.

దీంతో ఆయన ప్లేస్‌లో బాబీ డియోల్‌ను చిత్ర బృందం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లుకుతూ చిత్ర బృందం ఓ ప్ర‌త్యేక వీడియోను విడుద‌ల చేసింది. ఇందులో ఆయ‌న లుక్ ఆక‌ట్టుకుంటోంది.

Next Story