టికెట్ టు ఫైనల్.. అంచనాలు తలకిందులయ్యాయిగా..!

బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ ఆఖరి వారానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఫైనల్ కు ఎవరు చేరుతారోననే ఉత్కంఠ కొనసాగుతూ ఉంది.

By Kalasani Durgapraveen  Published on  28 Nov 2024 2:45 PM IST
టికెట్ టు ఫైనల్.. అంచనాలు తలకిందులయ్యాయిగా..!

బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ ఆఖరి వారానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఫైనల్ కు ఎవరు చేరుతారోననే ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టికెట్ టు ఫైనల్ టాస్క్‌లు బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతూ ఉంది. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మొదటి ఐదు స్థానాల్లో స్థానం కోసం హౌస్ మేట్స్ బాగా పోరాడుతున్నారు.

నిఖిల్, ప్రేరణ, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, నబీల్ అఫ్రిది, టేస్టీ తేజ, రోహిణి, గౌతమ్, అవినాష్ ఫైనల్‌లో తమ స్థానాన్ని కాపాడుకోవడానికి టాస్క్‌లలో తమ సర్వస్వాన్ని ఒడ్డి పోరాడుతున్నారు. కంటెస్టెంట్స్ నబీల్ అఫ్రిది, విష్ణుప్రియ టికెట్ టు ఫైనల్ రేసు నుండి ఎలిమినేట్ అయ్యారు. అయితే రాబోయే టాస్క్‌ల ద్వారా మొదటి ఐదు స్థానాల్లోకి తిరిగి రావడానికి వారికి ఇంకా అవకాశం ఉంది.

Next Story