బిగ్‌బాస్‌ 17 విన్నర్‌గా మునావర్‌ ఫారుఖీ

బిగ్‌బాస్‌ సీజన్‌ 17 విన్నర్‌గా మునావర్‌ ఫారుఖీ నిలిచారు. ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సాధించిన మునావర్‌ విజేతగా నిలిచినట్టు హోస్ట్‌ సల్మాన్‌ ఖాన్‌ ప్రకటించారు.

By అంజి  Published on  29 Jan 2024 6:55 AM IST
Bigg Boss 17, Munawar Faruqui, Salman Khan , Bollywood

బిగ్‌బాస్‌ 17 విన్నర్‌గా మునావర్‌ ఫారుఖీ

బిగ్‌బాస్‌ సీజన్‌ 17 విన్నర్‌గా మునావర్‌ ఫారుఖీ నిలిచారు. ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సాధించిన మునావర్‌ విజేతగా నిలిచినట్టు హోస్ట్‌ సల్మాన్‌ ఖాన్‌ ప్రకటించారు. ఫైనల్‌లో అభిషేక్‌ కుమార్‌, మునావర్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరకు 'బిగ్ బాస్ 17' విజేతగా మునవర్ ఫరూఖీ నిలిచారు. అతను ఇంటికి 50 లక్షల నగదు బహుమతిని మాత్రమే కాకుండా సరికొత్త కారును కూడా తీసుకున్నాడు. సెకండ్ రన్నరప్‌గా నిలిచిన అభిషేక్ కుమార్‌ను ఓడించాడు. ఈ సీజన్‌లో ఐదుగురు ఫైనలిస్ట్‌లలో మునావర్ ఫరూకీ, అంకితా లోఖండే, మన్నారా చోప్రా, అభిషేక్ కుమార్, అరుణ్ మాషెట్టీ ఉన్నారు. వారు విజేత ట్రోఫీ, నగదు బహుమతి కోసం పోటీపడ్డారు.

కాగా ఫైనల్‌ షోలో బిగ్ బాస్ వారి ప్రయాణాలను వివరించినప్పుడు, మునవర్ ఫరూఖీ, అభిషేక్ కుమార్ ఇద్దరూ ఏడ్చారు. వారి తల్లిదండ్రులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. కాగా మునావర్‌ ఓ స్టాండప్‌ కమెడియన్‌. గతంలో హైదరాబాద్‌లో ఆయన ఓ షో నిర్వహించారు. ఈ షోను అడ్డుకునేందుకు ప్రయత్నించి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌ అయ్యారు. ఆ తర్వాత పార్టీ నుంచి కూడా సస్పెండ్‌ అయ్యారు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ ఇప్పటి వరకు.. ఈ సీజన్‌తో కలిసి 17 సీజన్లు పూర్తి చేసుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరికొన్ని భాషల్లో బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారు.

Next Story