'కాంతార-2' మూవీ నుంచి బిగ్ అప్‌డేట్
'కాంతార- 2' సినిమా స్క్రిప్ట్ రెడీ అయ్యింది. త్వరలో ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.
By అంజి Published on 10 May 2023 11:43 AM IST'కాంతార-2' మూవీ నుంచి బిగ్ అప్‌డేట్
'కాంతార- 2' సినిమా స్క్రిప్ట్ రెడీ అయ్యింది. త్వరలో ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. పాన్-ఇండియా సూపర్ హిట్ మూవీ 'కాంతార' దర్శకుడు, ప్రధాన నటుడు రిషబ్ శెట్టి సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. 100 రోజుల వేడుక సందర్భంగా 'కాంతార' చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ సీక్వెల్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి నెలలో స్క్రిప్ట్ వర్క్ జరిగింది. 'కాంతార' సీక్వెల్‌కి సంబంధించిన స్క్రిప్ట్‌కి టీమ్ తుది మెరుగులు దిద్దింది. స్క్రిప్ట్ విషయమై నిర్మాత విజయ్ కిరగందూర్, నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి దీని గురించి సంతోషంగా ఉన్నారని వర్గాలు తెలిపాయి.
ఈ వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేయడంతో సినిమా విడుదల కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ చిత్ర బృందం లొకేషన్లను వెతుకుతున్నట్లు రిషబ్ శెట్టి సన్నిహిత వర్గాలు తెలిపాయి. అన్నీ కుదిరితే జూన్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో నటి సప్తమి గౌడ కథానాయిక. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మొదటి భాగం ఏకంగా రూ.500 కోట్ల వరకూ వసూలు చేసింది. కన్నడలోనే కాదు తెలుగు, తమిళం, హిందీల్లోనూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి భాగం విజయం సాధించడంతో రెండో భాగం పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది.