మరో 100 రోజుల్లో కలుద్దామంటున్న 'దేవర'.. లోడవుతోన్న టీజర్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ నటిస్తున్న 'దేవర' సినిమా మరో 100 రోజుల్లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా AllHailTheTiger అంటూ చిత్రయూనిట్‌ ట్వీట్‌ చేసింది.

By అంజి  Published on  27 Dec 2023 12:35 PM IST
NTR, Devara, Tollywood

మరో 100 రోజుల్లో కలుద్దామంటున్న 'దేవర'.. లోడవుతోన్న టీజర్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ నటిస్తున్న 'దేవర' సినిమా మరో 100 రోజుల్లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా AllHailTheTiger అంటూ చిత్రయూనిట్‌ ట్వీట్‌ చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో వచ్చే ఏప్రిల్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. జాన్వీకపూర్ ఈ సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీకి పరిచయం కానుంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా న‌టిస్తున్నాడు.

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఫస్ట్‌ పార్ట్‌ 2024 ఏప్రిల్ 5న విడుద‌ల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ లుక్‌ల‌ను రిలీజ్ చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి టీజ‌ర్ అప్‌డేట్ వ‌చ్చింది. ఇందుకు సంబంధించి మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ ఒక సాలిడ్ పోస్ట్ పెట్టాడు. 'దేవర' టీజ‌ర్ సూప‌ర్ వ‌చ్చింది. గూస్ బంప్స్ అంతే.. ఈ టీజర్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. అందరూ టైగ‌ర్‌ను అభినందించాల్సిందే అంటూ అనిరుధ్ రాసుకోచ్చాడు.

Next Story