OG మూవీకి తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్

పవన్ కల్యాణ్‌ నటించిన ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది

By -  Knakam Karthik
Published on : 24 Sept 2025 3:48 PM IST

Cinema News, Tollywood, OG, Telangana High Court,  OG movie

పవన్ కల్యాణ్‌ నటించిన ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. సినిమా రేట్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఓజీ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా ఓజీ టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ హోంశాఖ మెమో జారీ చేసింది. దీంతో హోంశాఖ మెమోను సవాల్ చేస్తూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వడానికి హోంశాఖ స్పెషల్ సీఎస్‌​కు ఎలాంటి అధికారాలు లేవన్న పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. హైదరాబాద్ పరిధిలో పోలీస్ కమిషనర్, జిల్లాల పరిధిలో జాయింట్ కలెక్టర్‌​కు మాత్రమే మెమో జారీ చేసే అధికారం ఉందన్న పిటిషన్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. టికెట్లు అధిక ధరకు విక్రయించకూడదని నిబంధనలు ఉన్నాయని, గేమ్ చేంజర్ సినిమా సందర్భంగా హోంశాఖ అండర్ టేకింగ్ కూడా ఇచ్చిందన్నారు పిటిషనర్ న్యాయవాది. దీంతో పిటిషనర్ న్యాయవాది వాదనను పరిగణలో తీసుకున్న హైకోర్టు, టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ జారీచేసిన మెమోను సస్పెండ్ చేసింది.కాగా తదుపరి విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది.

Next Story