బిచ్చగాడు 2 ట్రైలర్.. సూపర్ రెస్పాన్స్

Bichagadu 2 Trailer. విజయ్ ఆంటోనీ అంటేనే విభిన్న తరహా సినిమాలను తీస్తాడని అందరికీ తెలిసిందే..!

By M.S.R  Published on  29 April 2023 4:32 PM IST
బిచ్చగాడు 2 ట్రైలర్.. సూపర్ రెస్పాన్స్

విజయ్ ఆంటోనీ అంటేనే విభిన్న తరహా సినిమాలను తీస్తాడని అందరికీ తెలిసిందే..! గతంలో విజయ్ ఆంటోనీ చేసిన సినిమాలన్నీ ఆ కోవకే చెందినవి. 'బిచ్చగాడు' సినిమాతో విజయ్ ఆంటోనీకి భారీ పాపులారిటీ వచ్చింది. 2016లో వచ్చిన ఈ సినిమా ఊహించని సక్సెస్ ను అందుకుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా బిచ్చగాడు 2 తెరకెక్కుతోంది. మొదటి భాగంలో హీరోగా నటించిన హీరో విజయ్ ఆంటోనీనే ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. మే 19న ప్రేక్షకుల ముందుకి ఈ సినిమా రానుంది.


తాజాగా బిచ్చగాడు 2 ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. బిచ్చగాడు 2 ట్రైలర్ ఎంతో రిచ్ గా కనిపిస్తోంది. విజయ్ ఆంటోనీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. బిచ్చగాడు మొదటి పార్ట్ లో మదర్ సెంటిమెంట్ ఉండగా.. రెండో పార్ట్ లో సిస్టర్ సెంటిమెంట్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. బిచ్చగాడు 2 ట్రైలర్, సినిమాపై అంచనాలని పెంచేసింది. మొదటి పార్ట్ తరహాలోనే ఈ పార్ట్ కూడా భారీ హిట్ అందుకుంటుందని భావిస్తూ ఉన్నారు.


Next Story