విషాదం.. సినీ దర్శకుడు సుభాష్ కన్నుమూత
భోజ్‌పురి చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడు సుభాష్ చంద్ర తివారీ ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలోని తన హోటల్ గదిలో శవమై కనిపించారు.
By అంజి Published on 25 May 2023 8:07 AM ISTవిషాదం.. సినీ దర్శకుడు సుభాష్ కన్నుమూత
భోజ్‌పురి చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడు సుభాష్ చంద్ర తివారీ ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలోని తన హోటల్ గదిలో శవమై కనిపించారు. సినిమా షూటింగ్ కోసం ఆయన తన బృందంతో కలిసి హోటల్ తిరుపతిలో బస చేశారు. యూపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 24న సుభాష్ తుదిశ్వాస విడిచాడు. యశ్వీర్ సింగ్, పోలీసు సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. "అతని శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదు, మరణానికి గల కారణాన్ని నిర్ధారించడానికి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి విచారణ జరుగుతుంది" అని తెలిపారు. సుభాష్ చంద్ర తివారీ మహారాష్ట్రకు చెందినవారు. అతని అంత్యక్రియలు, మరణానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రముఖ టెలివిజన్ నటుడు నితీష్ పాండే మహారాష్ట్రలోని ఇగత్‌పురిలోని ఒక హోటల్‌లో శవమై కనిపించిన కొన్ని గంటల తర్వాత ఈ వార్త వచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీని గత కొన్ని రోజులుగా విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల వ్యవధిలో బుల్లితెర, సినీ పరిశ్రమలు నలుగురు మంచి వ్యక్తులను కోల్పోయాయి. యువ టెలివిజన్ నటుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మే 22న మరణించారు. ఒక రోజు తర్వాత, సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ నటి వైభవి ఉపాధ్యాయ రోడ్డు ప్రమాదంలో ఆమె తుది శ్వాస విడిచారు. నితీష్ పాండే 51 ఏళ్ల వయసులో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఈరోజు మే 25న ముంబైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.