భీమ్లానాయ‌క్ ట్రైల‌ర్‌పై స్పందించిన రామ్ చ‌ర‌ణ్.. ఏమ‌న్నాడంటే

Bheemla Nayak trailer electrifying Says Ram Charan.ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుపాటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Feb 2022 1:00 PM IST
భీమ్లానాయ‌క్ ట్రైల‌ర్‌పై స్పందించిన రామ్ చ‌ర‌ణ్.. ఏమ‌న్నాడంటే

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుపాటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'భీమ్లా నాయ‌క్‌'. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ న‌టిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం యూ ట్యూబ్‌లో ఈ చిత్ర ట్రైల‌ర్ 1,31,57,607 వ్యూస్‌తో దూసుకుపోతుంది.

ట్రైల‌ర్‌పై ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు స్పందించగా.. తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా బాబాయ్ చిత్ర ట్రైల‌ర్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. 'భీమ్లానాయక్ ట్రైలర్ ఎలెక్ట్రిఫయింగ్ !! పవన్ కళ్యాణ్ గారి ప్రతి డైలాగ్ & యాక్షన్ "పవర్ ఫుల్".. నా మిత్రుడు రానా పర్ఫార్మెన్స్ అండ్ ప్రెజెన్స్ అద్భుతం. #BheemlaNayakonFeb25 #Trivikram @saagar_chandrak @MenenNithya @SitharaEnts @MusicThaman ఆల్ ది బెస్ట్!!' అంటూ రామ్‌చ‌ర‌ణ్ ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

కాగా.. భీమ్లానాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైద‌రాబాద్ యూస‌ఫ్‌గూడ‌లోని పోలీస్ గ్రౌండ్‌లో జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయి. ఇక రామ్‌చ‌ర‌ణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న న‌టించిన ఆర్ఆర్ఆర్(రౌద్రం, ర‌ణం, రుధిరం) చిత్రం మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story