అఫీషియల్.. హిందీలో కూడా 'భీమ్లా నాయక్'

Bheemla Nayak to release in Hindi.ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి హీరోలుగా తెర‌కెక్కిన చిత్రం భీమ్లా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Feb 2022 7:15 AM GMT
అఫీషియల్.. హిందీలో కూడా భీమ్లా నాయక్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి హీరోలుగా తెర‌కెక్కిన చిత్రం 'భీమ్లా నాయ‌క్‌'. సాగర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలను అందిస్తున్నారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్ర విడుద‌ల‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెల‌కొంది. ఈ సినిమా విడుద‌ల‌కు రెండు తేదీల‌ను(ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1) ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఏపీలోనూ టికెట్ల వ్య‌వ‌హారం ఓ కొలిక్కి వ‌స్తుండ‌డం, క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టించడానికి నిర్మాత‌లు స‌న్నాహాకాలు చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్‌తో అభిమానులు పుల్ ఖుషీ అవుతున్నారు. తెలుగుతో పాటుగా హిందీలో కూడా ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ కన్ఫర్మ్ చేశారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. 'భీమ్లా నాయక్' చిత్రం హిందీలోనూ విడుదల అవుతుందని చెప్పారు.

Next Story
Share it