భీమ్లా నాయ‌క్ టైటిల్ సాంగ్ అదుర్స్‌

Bheemla Nayak Title song released.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం భీమ్లానాయ‌క్‌. సాగర్ కె చంద్ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sep 2021 6:08 AM GMT
భీమ్లా నాయ‌క్ టైటిల్ సాంగ్ అదుర్స్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం 'భీమ్లానాయ‌క్‌'. సాగర్ కె చంద్ర దర్శకత్వం తెర‌కెక్కుతున్న ఈచిత్రంలో రానా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. మ‌ల‌యాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్‌గా ఈచిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో ప‌వ‌ర్ స్టార్ ఓ ప‌వ‌ర్‌పుల్ పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇక నేడు(గురువారం) ప‌వ‌ర్ స్టార్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈచిత్ర టైటిల్ సాంగ్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది.

'శెబాష్.. ఆడాగాడు.. ఈడాగాడు.. అమీరోళ్ల మేడాగాడు గుర్రంనీల్ల గుట్టకాడ.. బెమ్మాజెముడు చెట్టున్నాది' అంటూ ఈ పాట సాగుతోంది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయ‌గా.. థ‌మ‌న్ సంగీతాన్ని అందించారు. సింగ‌ర్స్ శ్రీ కృష్ణ‌, పృథ్వీ చంద్ర‌, రామ్ మిర్యాలా ఈ పాట‌ను ఆల‌పించారు. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తున్నాడు. పవన్ సరసన నిత్య మీనన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియో గ్లింప్స్‎ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.

Next Story
Share it